ప్రజా సమస్యల పరిష్కారానికి మజిలీస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమద్ బేగ్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
ప్రజా సమస్యల పరిష్కారానికి మజిలీస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆ పార్టీ ఎం ఎల్ సి మీర్జా రెహమద్ బేగ్ అన్నారు ఆదివారం పురానాపూల్ డివిజన్లోని పలు ప్రాంతాలను పలు బస్తీలను ఆ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ తో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక బస్తీల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చొరవ చూపుతామని ఆయన తెలిపారు అభివృద్ధికి మజిలీస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు మోడీ పీకి జరగా వద్ద మైదానంలో ఉన్న చెత్తాచెదారాలు పేరుకుపోయాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొస్తే అక్కడ కమిటీ హాల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఎస్వీ నగర్ లో మరో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ఎస్వీ నగర్ బస్తీ అధ్యక్షుడు సదానంద్ స్థానికులు కోరగా ఆయన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకువెళ్లి కమిటీ హాల్ నిర్మాణానికి పాటుపడతానన్నారు పురానాపూల్ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమొహన్ మాట్లాడుతూ
కోట్లాది రూపాయలతో పురానాపుల్ డివిజన్ ను అభివృద్ధి చేసిన ఘనత మజిలీస్ పార్టీకి దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ అహ్మద్ ఖాన్ సహాయ సహకారులతో కోట్లాది రూపాయలు వెచ్చించి డివిజన్ అభివృద్ధి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మజిలీస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, అంజద్ మోహన్, ప్రభాకర్, కాలేద్ బిన్ మాజీ ద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: