గడివేముల మండల ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు

ఇతర ఊర్లకు వెళ్లేవారు.. ఇంటి భద్రత విషయంలో జాగ్రత్త వహించండి

గడివేముల ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య  విజ్ఞప్తి



(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ముస్లిం సోదరులందరికీ గడివేముల ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సమేతంగా ఉపవాస దీక్షలలో ఉండి ఆనందంగా పండగ జరుపుకోవడానికి తమ సొంత గ్రామాలకు వెళుతున్న ముస్లిం సోదరులందరూ, వివిధ కార్యక్రమాలపై వివిధ గ్రామాలకు వెళ్తున్న ప్రజలందరికీ విజ్ఞప్తి....విలువైన వస్తువులు, నగదు, బంగారును అవసరమైనంత మేరకు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలని, బీరువాకు తాళం వేసి తాళాము చెవులు బీరువా పైబాగంలోకాని, బీరువాలోని బట్టల క్రింద మరియు ఇంటి ఆవరణలోని గోడలో ఉంచరాదని, బయటకు వెళ్లేటప్పుడు లేదా గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో మరియు బయట విద్యుత్ బల్బులు వెలుగుతూ  ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇంటికి నాసిరకం తాళాలు వాడొద్దని, తాళం కనిపించకుండా కర్టన్స్ వేయాలని,అత్యవసర పరిస్థితుల్లో ఇతర ఊర్లకు వెళ్ళినప్పుడు మీ ఇంటి పక్కన ఉండే సహచర మిత్రులకు, బంధువులకు ఫోన్‌ చేసి ఇంటిని గమనిస్తూ ఉండమని చెబుతూ ఉండాలని, ఇంటికి తాళంవేసి బహిరంగప్రదేశంలో లేదా మిద్దెలమీద(డాబా) నిదురించే సమయంలో మెళుకువ వచ్చిన వెంటనే క్రిందికి వచ్చి ఇంటిని గమనించాలని, కాలనీలలో ,గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్న అనుమానం కలిగితే వారిని వివరాలు అడిగి వారి నుండి ఎలాంటి సరియైన సమాధానం తెలుపకపోతే  9121101097 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, గడివేముల మండల ప్రజల అందరూ నిబందనలను పాటించి పోలీసు వారికి సహకరించాలని  గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: