భూసార నమూనాల సేకరణపై...
గడివేముల మండల స్థాయి శిక్షణ కార్యక్రమం....
వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల వ్యవసాయశాఖ సిబ్బందికి మట్టి నమూనాల సేకరణపై,భూమిలో పోషకాల ఆవశ్యకత, భూసార పరీక్షల ప్రాముఖ్యత,సమస్యత్మక నేలలు (చవుడు) - బాగుచేయుట,సమగ్ర సమతుల ఎరువుల గురించి ఆర్బికే సిబ్బందికి గడివేముల మండల వ్యవసాయశాఖ అధికారి హేమసుందర్ రెడ్డి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆర్బీకే సిబ్బందితో మాట్లాడుతూ రైతుల నుండి సేకరించిన మట్టి నమూనాలో కనుగొనబడే లక్షణాలు - నేల రంగు, స్వభావము,రకము,రుచి, ఉదజని సూచిక,లవణ శాతము,సేంద్రియ కర్బనము మరియు ముఖ్య పోషకాలైన నత్రజని,భాస్వరం, పొటాషియం పంటలకు ఎంత వరకు అందుతున్నాయో తెలుసుకొని రైతుసోదరులకు తెలుపవచ్చని,భూమిలో పోషకాలు తక్కువగా ఉన్నట్టయితే రైతులు 30% ఎరువులు అదనంగా పంటభూములకు
అందించవలసి ఉంటుందని,రైతు సోదరులందరూ ఆర్బికే సిబ్బందిని సంప్రదించి ప్రతి 5 ఏకరాలలో మట్టి నమూనాలను తమ పొలాలలో సేకరించి భూసార పరీక్షలు చేయించుకోని అధిక దిగుబడులు పొందాలని తెలిపారు.
Home
Unlabelled
భూసార నమూనాల సేకరణపై... గడివేముల మండల స్థాయి శిక్షణ కార్యక్రమం.... వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: