పంచాయతీలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం
గడివేముల ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు శివ మల్లేశ్వరప్ప ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మండల స్థాయిలో దారిద్ర నిర్మూలన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన కొరటమద్ది, కే.బొల్లవరం,ఓందుట్ల పంచాయతీలకు ప్రశంశా పత్రాలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచులు,ఎంపీటీసీలు మరియు పంచాయతీ కార్యదర్శిల సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో స్వయం పరిపాలనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళితే అభివృద్ధి సాధ్యమవుతుందని, మండల అభివృద్ధి అధికారి శివ మల్లేశ్వరప్ప తెలిపారు. గడివేముల జడ్పిటిసి ఆర్బి.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల పటిష్ట పరిచేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చిందని,
గతంలో పంచాయతీ స్థాయిలో వీఆర్వో మరియు కార్యదర్శి మాత్రమే అందుబాటులో ఉండే వారిని ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ వల్ల గ్రామస్థాయిలో వివిధ శాఖల్లో అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని,గ్రామాల అభివృద్ధి చెందితేనే మండల అభివృద్ధి జరుగుతుందని,ప్రతి పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు సర్పంచులు మరియు కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన అనంతరం సర్పంచ్లకు, కార్యదర్శిలకు, ఎంపీటీసీలకు ప్రశంశా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు,పంచాయతీ కార్యదర్శులు,ఆర్బికె చైర్మన్ పుల్లయ్య, వైస్ ఎంపీపీ కాలు నాయక్ పాల్గొన్నారు.
Home
Unlabelled
పంచాయతీలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం,,,, గడివేముల ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: