అనందపురం గ్రామానికి వంతెన (బ్రిడ్జి) నిర్మించాలి....
బిఎస్సి పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఆనందపురం గ్రామానికి వంతెన (బ్రిడ్జి) నిర్మించాలని బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ బ్రిటీష్ వారు సుంకేసుల టూ కడప జిల్లాలకు కేసీ కెనాల్ పై వంతెనలు నిర్మించారని,ఈ వంతెనలు అక్కడక్కడ కృంగిపోయాయని, కృంగిపోయిన చోట నూతన వంతెనలు నిర్మించిన నేపథ్యంలో పాములపాడు మండలం ఆనందపురం గ్రామంలో వంతెన నిర్మించడంలో ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు విఫలమయ్యారని,
బ్రిటిష్ వారు నిర్మించిన బ్రిడ్జిలను తీసివేసి కొత్తగా సుంకేసుల నుండి కడప జిల్లాలకు కేసీ కెనాల్ పై బ్రిడ్జిలను నిర్మించారని,ఆనందపురం గ్రామానికి సంబంధించినటువంటి బ్రిడ్జిని ఇంతవరకు నిర్మించకపోవడం ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు విమర్శించారు. ఆనందపురంలో వంతెన (బ్రిడ్జి) నిర్మించకపోతే కృష్ణరావుపేట,జూటూరు, ఆనందపురం,రుద్రవరం గ్రామాల ప్రజల అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Home
Unlabelled
అనందపురం గ్రామానికి వంతెన (బ్రిడ్జి) నిర్మించాలి.... బిఎస్సి పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: