జీవో52 ను రద్దు చేయాలి

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ నాయక్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఆత్మకూరులో జీవో52ను రద్దు చేయాలని,ఇతర కులాల వారిని ఎస్టీ జాబితాలో అనుమతించమని,ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని శాసన సభలో ప్రవేశపెట్టి తీర్మానం చేసిన దానిని రద్దు చేయాలని,  9వ తేదీన కర్నూల్ పట్టణంలోని వెంకయ్య పల్లి అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉన్న శ్రీనివాస్ గార్డెన్ లో జరగబోయే ఆల్ ఇండియా బంజారాసేవా సంఘం సమావేశంను జయప్రదం చేయాలని రాష్ట్ర అద్యక్షులు వెంకటరమణ నాయక్ తెలిపారు.సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని,


52 జీవోపై భవిష్యత్ కార్యాచరణపై పెద్దల సమక్షంలో వారి యొక్క సూచనలు సలహాలతో ముందుకు సాగుతామని,తాండాలలో, గూడాలలో అభివృద్ధికి ఆమడ దూరంలో వుండి అనేక ఇబ్బందులు పడుతున్న గిరిజనజాతులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాల్మీకులను 52 జీవో పేరుతో తీసుకువచ్చి ఎస్టీ జాబితాలో చేరిస్తే గిరిజనజాతి బిడ్డల భవిష్యత్తు ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని తండాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో విక్రమ్ సింహనాయక్ అడ్వకేట్, విజయ్ నాయక్, డుమావతస్వామినాయక్, వెలుగోడు మండల ఉపాధ్యక్షుడు శంకర్ నాయక్,నీలానాయక్, సురేష్ నాయక్,బిలావత్ సుధాకర్ నాయక్, గుంతకంతల డుమావతవెంకటేశ్వర్లు నాయక్,బంజార సేవాసంఘం నాయకులు  పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: