చెంచుగూడాలపై ఫారెస్ట్ అధికారుల దాడులు తక్షణమే అపాలి...                        సిపిఐ(యంయల్)ఆర్ఐ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రాజ్ డిమాండ్ 

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని స్థానిక ‌శ్రీశైలం దేవస్థానం దగ్గరలో వున్న అన్నదాన సత్రాల దగ్గర ఉన్న మాణిక్యమ్మ, శీల చెంచుగూడాలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలను తక్షణమే ఆపాలని సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంచుగూడంలో సుమారు నలభై కుటుంబాలు అనేక సంవత్సరాల నుండీ అక్కడ జీవనం సాగిస్తున్నారని, అక్కడ నివాసం ఉంటున్న కుటుంబాలకు శాశ్వత ఇండ్లపట్టాలు మంజూరు చేయాలని ఎన్నో సంవత్సరాలనుండి అధికారులను కోరుతున్న అధికారులు,


నాయకులు వారిని పట్టించుకోకుండ వారి సమస్యలను గాలికి వదిలేశారని,అధికారులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి జెసిబి లతో వారి గుడిసేలను తోలగించాలను కోవడం ఎంతవరకు సమంజసం అని,కలెక్టర్లు చెంచుగూడాలను సరైన వసతులు కల్పించాలని ప్రయత్నిస్తుంటే ఫారెస్ట్ అధికారులు మాత్రం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఉన్న సత్రాలు కాకుండా ఇంకా సత్రాల నిర్మాణం కోసం చెంచుగూడాలపై ప్రతాపం చూపాలనుకోవడం దారుణమని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్  తక్షణమే స్పందించి గూడెం ప్రజలకు శాశ్వితపట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.చెంచు గూడెం ప్రజలకు న్యాయం చేయకపోతే చెంచుగూడెం ప్రజలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భూదేవి, రమణమ్మ,లక్ష్మి,అంకమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: