సకల సదుపాయాలతో..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మహేశ్వరం నియోజకవర్గములో మంజూరు అయిన పాలిటెక్నిక్ కళాశాలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి, వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు అవుతున్న నూతన పాలిటెక్నిక్ కళాశాలకు 63 నూతన పోస్టులు మంజూరు చేసినట్లు విద్యా శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి 15 కోట్ల 80 లక్షల నిధులకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించిందన్నారు. కళాశాలలో మూడు డిప్లొమా కోర్సులతో వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ లో పెద్ద ఎత్తున వస్తున్న కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కోసం వృత్తి, నైపుణ్య కోర్సులు చేసిన వారికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుందని మంత్రి తెలిపారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్,డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులలో 60 సీట్ల చొప్పున మంజూరు చేసినట్లు, స్థానిక విద్యార్థి, యువజనులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
Home
Unlabelled
సకల సదుపాయాలతో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం ,,,, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: