విభజన హామీలు విస్మరించి... ప్రతిసారి రిక్తహస్తమే

తెలంగాణ వాసులకు  ప్రతి పర్యటనలో నిరాశే మిగుల్చుతున్న ప్రధాని

విద్యాశాాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి తెలంగాణ వాసులకు ప్రధాని నరేంద్ర మోదీ నిరాశే మిగుల్చుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని రాష్టానికి వస్తున్న ప్రతిసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవటం లేదని వెల్లడించారు. ప్రధాని వస్తే వరాల జల్లులు కురుస్తాయనుకుంటే ఎన్నడూ నిరాశానేనా అని మంత్రి ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి  ,కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా డిమాండ్ కు మోక్షం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రంగారెడ్డి రూపురేఖలు మార్చే ఐటిఐఆర్ ప్రాజెక్ట్ ను ఎందుకు పక్కన బెట్టారని మంత్రి ప్రశ్నించారు.


షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో  జిల్లా పార్టీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి ముఖ్య అతిథిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.  దేశ ప్రధాని వస్తే రాష్టానికి ఏమైనా మేలు జరుగుతుందని ప్రజలంతా ఆశిస్తారని తీరా ఎలాంటి లాభం ఉండదన్నారు. తెలంగాణ రాష్టాని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే,కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపుతుందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,24 గంటల విద్యుత్, కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్,దళిత బంధు రైతు బంధు,రైతు భీమా,కేసీఆర్ కిట్,గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, మృత్స కారులకు చేప పిల్లల పంపిణీ ఇలా అన్ని మతాల, వర్గాల,రంగాల వారికి తెలంగాణలో న్యాయం చేకూరుతుందన్నారు.

నేడు కేసీఆర్ కుటుంభం గురుంచి మాట్లాడే వారు ముందుగా నాడు వారంతా ఉద్యమం లో ఎలాంటి పాత్ర పోషించారో తెలుసుకోవాలన్నారు.వారుఉద్యమం లో క్రియాశీల పాత్ర పోషించలేద అని ప్రశ్నించారు.నాడు వారు ఉద్యమం లో పోషించిన పాత్ర ప్రజలందరికీ తెలుసన్నారు.  తెలంగాణ అభివృద్ధి ని కాక్షింస్తే ఫార్మా సిటీ కి,మెట్రో ఫేజ్ 2 కు సహకరించాలన్నారు.దేశమంతా ఇచ్చిన అనేక విద్యాలయాలను తెలంగాణకు ఇవ్వాలన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గారి పెరు పెట్టారని, పార్లమెంట్ కు కూడా అంబెడ్కర్ గారి పేరు పెట్టాలని డిమాండ్ చేసారు.  రాజకీయ లబ్ది కోసం పసి పిల్లలు జీవితాలతో బీజేపీ నేతలు అడుకోవద్దని, చిన్న పిల్లలను రాజకీయాలలోకి లాగొద్దన్నారు.పేపర్ లీక్ చేసే ఘటనలో పట్టుబడ్డ తర్వాత కూడా బీజేపీ నాయకులు బుకాయిస్తున్నారని,ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్నారు.  బిఆర్ఎస్ అంటే ప్రజలకు భరోసా అని ఆత్మీయ సమ్మేళనాలతో క్యాడర్ లో నూతన ఉత్సహం వస్తుందని అన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: