స్వార్థం కోసం కాదు అందరి కోసం పనిచేసినప్పుడే నా ఆశయాలు నెరవేరుతాయి 

బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న ఆ మాటలు నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

రూ.56లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

స్వార్థం కోసం కాదు అందరి కోసం పనిచేసినప్పుడే నా ఆశయాలు నెరవేరుతాయి అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న ఆ మాటలు నాకు ప్రతిక్షణం గుర్తుకు వస్తుంటాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ గ్రామంలోని  8వ డివిజన్ 9వ డివిజన్లో 56 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నమాట ఒక మాట గుర్తు వస్తుంది ఎప్పటికీ ఏదైనా సరే స్వార్థం కోసం కాకుండా అందరి కోసం ఆలోచించినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలు  నెరవేరుతాయని మంత్రిగారు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడిప్పుడే మహేశ్వరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చాలువతో  అభివృద్ధి పనులు కోట్లాది కోట్లాది రూపాయలతో జరుగుతున్నాయి, మరికొన్ని కూడా దశలవారీగా జరుగుతాయని అన్ని ప్రాంతాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం  శేఖర్, బడంగ్పేట్  మున్సిపల్  కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు , కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు జగన్మోహన్ రెడ్డి, భాగ్యనగర్ బ్యాంకు చైర్మన్ మర్రి సింహారెడ్డి, మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, కోటగిరి జంగయ్య, మాజీ కౌన్సిలర్ మంజుల కుమార్ గౌడ్, మాజీ కౌన్సిలర్ యాదయ్య , పెద్దబావి ఆనంద్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: