పాణ్యం  బస్టాండ్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చెయాలి

సిపియం నేతల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజక వర్గం పరిధిలోని స్థానిక  మండలకేంద్రం లోని బస్టాండ్ లో త్రాగుటకునీరు,మహిళలకు మరుగుదొడ్లు,బస్సు సమాచార కౌంటర్ ను, విద్యార్థులకు బస్సుపాస్ కౌంటర్ ను ఏర్పాటు చెయాలని కోరుతూ భారతకమ్యునిస్టు పార్టీ(మార్క్సిస్టు) అధ్వర్యంలో శ్రీనివాసరావ్,బత్తిని ప్రతాప్ ఆద్వర్యంలో స్థానిక పాణ్యం తహసిల్దార్  కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో మండల తాసిల్దార్ మల్లికార్జునరెడ్డికి వినతిపత్రం అందజేసిన ఆనంతరం వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నాలుచేసి గ్రామ పంచాయితీ, తాసిల్దార్ కు, జిల్లా కలెక్టర్ అధికారులకు  ఎన్నోసార్లు వినతిపత్రంలు అందజేసినా ఫలితం లేదని 


 చుట్టుప్రక్కల దాదాపుగా 18 గ్రామాల నుండి ప్రజలు నిత్యం వారి  అవసరలకోసం వందల మంది ప్రజలు వస్తు వెళుతూ ఉంటారని, ప్రయాణికులకు కనీసం త్రాగడానికి నీరు,కనీస అవసరలు తీర్చుకోవడానికి మహిళలకు మరుగుదొడ్లు లేక అనేక అవస్థలుపడుతున్నారని, బస్టాండ్ స్థలములో షాపులు కేటాంచి,షాపుల వారినుండి వేలరూపాయలు వసూలు చేస్తున్న ఆర్టిసి యాజమాన్యం,సిబ్బంది ప్రజల అవస్థలు పట్టించుకునే నాధుడేలేరని ఉన్నతాదికారులు స్పందించి చర్యలు తీసుకోని సమస్యను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈకార్యక్రమంలో విద్యార్ధి సంఘం నాయకులు కార్తీక్,చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: