ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
73 వ జన్మదిన వేడుకలు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండల పరిధిలోని గడివేముల, బిలకల గూడూరు గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టీడీపి నేతలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తులకు గడివేముల ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ చేశారు. కేకు కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గడివేముల మండలం కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీకాంత్,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఫరూక్, మాజీ సర్పంచ్ జయంత్ రెడ్డి, మండల మాజీ జడ్పీ కో ఆప్షన్ నెంబర్ రఫీక్, మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి పాణ్యం అసెంబ్లీ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ నజీర్ అహ్మద్ షేక్ కాలిక్, సీతారాముడు, నబి రసూల్ ఎస్ అబ్దుల్ కరీం, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.
Home
Unlabelled
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... 73 వ జన్మదిన వేడుకలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: