లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి,,,
మహేష్ గౌడ్ చేసిన సేవలు చిరస్మరణీయ
ఛత్రినాక ఇన్స్పెక్టర్ బోజ్యానాయక్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
తెలంగాణ లో ప్రసిద్ధి చెందిన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి మహేష్ గౌడ్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఛత్రినాక ఇన్స్పెక్టర్ బోజ్యానాయక్ అన్నారు. లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం మాజీ చైర్మన్ గౌని మహేష్ కుమార్ గౌడ్ 73వ జయంతిని పురస్కరించుకొని శ్రీ మహాకాళి మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ఛత్రినాక ఇన్స్పెక్టర్ బోజ్యానాయక్ ముఖ్యఅతిధిగా హాజరై మహేష్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బోనాల పండుగను జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి మహేష్ గౌడ్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహాకాళి మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ కె.ప్రవీణ్ కుమార్ గౌడ్,అధ్యక్షులు జి.అరవింద్ కుమార్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కె.వెంకటేష్ ,సభ్యులు బి. సురేష్ గౌడ్, లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం మాజీ చైర్మన్ లు జి.కాశీనాథ్ గౌడ్,కె.విష్ణు గౌడ్,బి.బల్వంత్ యాదవ్,సి.రాజ్ కుమార్ యాదవ్,ఎ.మాణిక్ ప్రభు గౌడ్,టి.నర్సింగ రావు,ఫోర్ మెన్ కమిటీ సభ్యులు సీరా రాజ్ కుమార్,పి.సురేందర్ ముదిరాజ్,ఎ.బద్రీనాథ్ గౌడ్ మహేష్ గౌడ్ సన్నిహితులు అయన అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Home
Unlabelled
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి,,, మహేష్ గౌడ్ చేసిన సేవలు చిరస్మరణీయ,,,, ఛత్రినాక ఇన్స్పెక్టర్ బోజ్యానాయక్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: