పేద ప్రజల న్యాయమే మా లక్ష్యం
బనగానపల్లె సిపిఐ సమితి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాలజిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని స్థానిక బనగానపల్లేలో భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) జాతీయ పిలుపు మేరకు బనగానపల్లె పట్టణంలో నాలుగవ రోజు సిపిఐ ప్రచార బేరి కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె మండల ఆఫీస్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన తెలియజేసిన అనంతరం బనగానపల్లెలో ఉన్న ప్రతి దుకాణదారుల వద్దకు వెళ్లి కరపత్రాలను పంచి,నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్న విధానంపై ప్రజలకు వివరంగా తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుష పాలన మానుకోవాలని,
కులాల,మతాల మధ్యన వ్యత్యాసం చూపుతు పరిపాలన చేయడం సమంజసం కాదని, ప్రజలందరికీ సమన్యాయం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుబ్బారెడ్డి,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బనగానపల్లి శివయ్య,ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శివ బాలకృష్ణ,గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు కాళంగి రాముడు,సిపిఐ నాయకులు శివ నాగయ్య, ఖాదర్ బాషా,సభ్యులు భాస్కర్ రెడ్డి పైలెట్ భాష తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
పేద ప్రజల న్యాయమే మా లక్ష్యం... బనగానపల్లె సిపిఐ సమితి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: