బస్సు పాస్ లేకున్నా ఓకే

ఒరిజినల్ హాల్ టికెట్ ఉంటే చాలు

ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్లు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి) 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు 03-04-23 వతేదీ నుండి 18-04-23 వతేదీ వరకు జరుగుతున్న సందర్భంగా పదవ తరగతి పరీక్షలు వ్రాయు విద్యార్థిని,విద్యార్థులు వారి పరీక్ష కేంద్రాలకు వెళ్ళు రహదారుల్లో వెళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి ఆర్టీసీ వారు మంజూరు చేసిన బస్సు పాసులు అవసరం లేదని, విద్యార్థిని,విద్యార్థులు వారి యొక్క ఒరిజినల్ హాల్ టికెట్లను చూపించి బస్సులో ప్రయాణించి పరీక్ష కేంద్రాల గమ్యస్థానాలకు చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసిందని,ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని,పదవ తరగతి పరీక్షలు వ్రాయు విద్యార్థిని,విద్యార్థులు పరీక్షాల కేంద్రాల వైపు ఆర్టీసీ బస్సులు ఎక్కడ చేయి ఎత్తిన వారిని ఎక్కించుకొని గమ్య స్థానాలకు చేర్చాలని ఆర్టీసీ ఉద్యోగులకు సూచించామని ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్లు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: