ప్రశాంత వాతావరణంలో...

గడివేములలో  పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

ఎంఈఓ రామకృష్ణుడు 

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడివేముల హైస్కూల్, కరిమద్దేల హైస్కూల్, గడిగరేవుల హైస్కూల్, కేజీబీవి హైస్కూల్,మోడల్ హైస్కూల్ లలో చదువుతున్న 480 మంది విద్యార్థినీ విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని వారికి గడివేముల జడ్పీహెచ్ఎస్  మరియు మోడల్ హైస్కూల్ నందు పరీక్ష కేంద్రాలను  ఏర్పాటు చేశామని,మొదటి కేంద్రము గడివేముల జడ్పీహెచ్ఎస్ నందు 250 మంది విద్యార్థిని విద్యార్థులు మరియు


మోడల్ హైస్కూల్ నందు 230 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని,విద్యార్థులు పరీక్షలు వ్రాయు సమయంలో అస్వస్థకు గురైన వెంటనే స్పందించడానికి వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని,పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  విద్యార్థినీ విద్యార్థులు పరీక్ష రాసుకోవడానికి పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: