"విజయ సంకల్ప సభ"కు భారీ  కాన్వాయ్...కార్యకర్తలతో

తరలివెళ్లిన  బీజేపీ రాష్ట్ర నాయకులు  బుక్క వేణుగోపాల్


(జానో జాగో వెబ్  న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)

అమిత్ షా రాక సందర్భంగా బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభను ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ అగ్రనేతలంతా నడుంకట్టారు. ఈ క్రమంలో ఆదివారంనాడు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భాగంగా నిర్వహించిన భారతీయ జనతా పార్టీ "విజయ సంకల్ప సభ" భారీ బహిరంగ సభకు రాజేంద్రనగర్ నియోజకవర్గం బిజెపి నాయకులతో కలిసి భారీ  కాన్వెయ్ తో  బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ బయలుదేరి వెళ్లారు.


.   ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నానావల్ల కుమార్ యాదవ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బుక్క కృష్ణ, బిజెపి జిల్లా కార్యదర్శి చంద్రయ్య, బిజెపి శంషాబాద్ మండల అధ్యక్షులు చిటికెల వెంకటయ్య, బిజెవైఎం శంషాబాద్ మండల అధ్యక్షులు బుక్క ప్రవీణ్ కుమార్, బిజెపి శంషాబాద్ ఉపాధ్యక్షలు మండల బూరుకుంటా సంజీవ, బిజెపి నాయకులు మల్చలం మోహన్ రావు, మాధవరెడ్డి, మెండే కుమార్ యాదవ్,  ప్రకాష్, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: