మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణకు హాజరైన....

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు..రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య

 (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మరియు బీసీ సంఘాల నేతలు,ప్రజా సంఘాల నేతలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే కుల వివక్షను రూపుమాపడానికి ఎంతగానో కృషి చేశారని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో తన ధర్మపత్రికి కానీ గురవై చదువు చెప్పించి మహిళల అభ్యున్నతికి, అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మహనీయుడని,


ఇలాంటి మహనీయుని విగ్రహావిష్కరణ పాములపాడు మండల కేంద్రంలో నిర్మించడం చాలా సంతోషదాయకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 
నంద్యాల జిల్లా కేంద్రం బీసీ సంఘాల నేతలు బాలచంద్రుడు,రమణయ్య గౌడు,వేణుగోపాల్ నాయుడు,సీనియర్ దళిత సంఘం నేత కడియం సాంబశివుడు, బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనారిటీ- విద్యార్ధి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్, ఆర్వీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజునాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్, వెంకటరమణ యాదవ్,బాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: