టి ఎస్ పి ఎస్ సి బోర్డు ను రద్దు చేసి పూర్తిగా ప్రక్షాళన చేయాలి

ఏబీవీపీ కోఠి జిల్లా కన్వీనర్ సభావట్ కళ్యాణ్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

టి ఎస్ పి ఎస్ సి బోర్డు ను రద్దు చేసి పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. టి ఎస్ పి ఎస్ సి ఛైర్మెన్, సెక్రటరీ, బోర్డు మెంబెర్స్ ని అరెస్ట్ చేసి విచారణ చేయాలనీ.. ఈ ఘటన పై సిట్ చే కాకుండా సిట్టింగ్ జడ్జి చే విచారణ చేయాలని డిమాండ్ డిమాండ్ చేస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోఠి జిల్లా, చార్మినార్ శాఖ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా  ఏబీవీపీ కోఠి జిల్లా కన్వీనర్ సభావట్ కళ్యాణ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి అని కోటి ఆశలతో తెలంగాణ ఉద్యమం కొనసాగించి అక్రమ కేసులు భరించి,జైళ్లతో చెలిమి చేసి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు నియామక పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యతగల   టి ఎస్ పి ఎస్ సి పేపర్లు అమ్ముకునే దౌర్భాగ్యమైన పరిస్థితి దిగజారిందని 


టి ఎస్ పి ఎస్ సి నిర్వహించిన అనేక పరీక్షల్లో పేపర్ లీకులు జరిగినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం నిరుద్యోగుల యొక్క దౌర్భాగ్యం అని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శాపంగా మారిందని అన్నారు. ఖాళీగా ఉన్న నియామకాలు భర్తీ చేయడంలో టి ఎస్ పి ఎస్ సి విఫలమైందని,విద్యార్థుల పోరాటాల వాళ్ళ 9ఏండ్ల తరువాత నోటిఫికేషనలలో అనేక నోటిఫికేషన్లు  కోర్టు మెట్లు ఎక్కాయని,నిర్వహించిన కొన్ని పరీక్షల కు కూడా లీకేజీ శాపం తగిలిందన్నారు..ఇప్పటిదాకా లీకేజీ కి భాద్యత వహిస్తూ బోర్డు ఛైర్మెన్, సెక్రటరీ, సభ్యులు రాజీనామా చేయక పోవడం సిగ్గు చేటని, రాజకీయాలపై స్పందించే ముఖ్యమంత్రి 30 లక్షల బ్రతుకులు బజారున పడిన స్పందించలేదంటే, బోర్డు ను రద్దు చేయలేదంటే దీని వెనకాల సీఎం కుటుంబ సభ్యులు, మంత్రులు బీఆర్ఎస్ నాయకుల హస్తము ఉన్నట్టు స్పష్టమవుతుందని..దీనిపై ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సిట్ తో కాకుండా సిట్టింగ్ జడ్జితో  విచారణ జరిపించాలని  డిమాండ్ చేస్తూ, విద్యార్థి నిరుద్యోగి యువతకు న్యాయం జరిగే వరకూ ఏబీవీపీ  పోరాటం కొనసాగిస్తుందని తదనంతర పర్యవసనాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

1.టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజీ సంఘటన పైన జరిపిన సిట్టు విచారణ నివేదికను బహిరంగపరచాలి మరియు సిబిఐచే విచారణ జరిపించాలి. 

2. లీకేజీ కుంభకోణంలో రాజకీయ జోక్యంపై ,ప్రభుత్వపెద్దలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ  జరిపించాలి.

3.టి ఎస్ పి ఎస్ సి చైర్మన్ ,క్రటరీ లను తొలగించిన తర్వాతే టి ఎస్ పి ఎస్ సి పరీక్షలు నిర్వహించాలి..

ఈ  కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు దిలీప్, కార్యదర్శి సజన్, ఎస్ ఎఫ్ డి కన్వీనర్ రాహుల్ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్ సందీప్, ప్రియా,చందు, భవ్యశ్రీ, అభి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: