బూజునూరు గ్రామంలో..... అర్ధరాత్రి భారీ చోరీ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని బూజునూరు గ్రామంలో అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగిందని బాధితులు వాపోతున్నారు. శంకరమ్మ, కుమారుడు జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేసిన అనంతరం మెడ పైకి వెళ్లి నిదురించిన తర్వాత ఉదయం నాలుగు గంటల


సమయంలో కిందికి వచ్చి వచ్చి చూడగా కిటికీలు, తలుపులు అన్నీ తెరుచుకుని ఉండడంతో అనుమానం వచ్చి లోనికి వెళ్లి చూడగా బీరువా తలుపులు పగలగొట్టి ఉన్నాయని,అర్ధరాత్రి సమయంలో స్వగృహం నందు కిటికీ ఊచలు తొలగించి గుర్తు తెలియని అగంతకులు లోపలికి ప్రవేశించి బీరువాల్లో ఉన్న దాదాపు రూ.25 లక్షల రూపాయలు విలువచేసే మూడు బంగారు లాంగ్ చైన్లు,ఒక హారం,నాలుగు బంగారు గాజులు మరియు మూడు జతల చెవి కమ్మలు,


బంగారు గొలుసులు,కాళ్ల పట్టీలు మరియు 20వేల నగదును అగంతకులు తీసుకుని వెళ్లారని నిర్ధారించుకున్న అనంతరం బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గడివేముల పోలీసు సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి ఆగంతకులు ఎవరు,ఎక్కడినుండి వచ్చారన్న  విషయాన్ని గ్రామ సచివాలయంలోని సీసీ  పుటేజలను పరిశీలించి నంద్యాల నుండి వచ్చిన క్లూస్ టీం మరియు డాగ్స్ స్క్వాడ్ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: