వేసవి కాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చేయాలి
బీఎస్పీ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని కొత్త బానకచెర్ల గ్రామంలో వేసవి కాలం మొదలైన తరుణంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు,ఎంపీడీవోలు అప్రమత్తమై గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా చేయాలని బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి ఎల్ స్వాములు అధికారులను డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాములపాడు మండలం కొత్త బానకచెర్ల గ్రామంలో దాదాపుగా 8 నెలల క్రిందట ఇంటింటికి కుళాయిల కనెక్షన్ కొరకు ప్రభుత్వం 23 లక్షలు మంజూరు చేస్తే టెండర్ను దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రభుత్వం నుండి బిల్లులు మంజూరు కావని తెలిసి కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదని, ఎస్సీ కాలనీకి దగ్గరనున్న బోరు లోతుగా ఉన్న అందుకు సరిపడా పైపులు అధికారులు వెయ్యనందున బోరు నుండి కొద్దిసేపు మాత్రమే నీరు వస్తుందని,నీరు సరిపోక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, గ్రామంలో నీళ్ల ట్యాంకు ప్రజలకు సరిపోయేంతగా లేదని,గ్రామంలో కొంతమంది మోటర్లు వేయడం వలన ఎస్సీ కాలనీలోని కుటుంబాలకు నీరు అందడం లేదని,పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదని,ఇతర కాంట్రాక్టర్లు కూడా పనులు చేయడానికి ముందుకు రావడంలేదని,
గ్రామంలో చేతి పంపులను బాగు చేయించి,పెద్ద ట్యాంకును పునర్ నిర్మించి ఉన్న బోరుకు మరిన్ని పైపులు వేసి గ్రామ ప్రజల దాహార్తి తీర్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామంలో సమస్యలను తీర్చకపోతే బానకచర్ల గ్రామస్తులను ఏకం చేసి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వెంకటరమణ, కురుమన్న, ఏసన్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Home
Unlabelled
వేసవి కాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చేయాలి.. బీఎస్పీ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: