ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక
ఉపవాసాలతోపాటు ధనధర్మాలు చేయడం గొప్పవిషయం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పహాడీ షరీఫ్ ఇప్తార్ విందులో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు ఉపవాసాలు ఉండి సమాజంలోని పేదలకు దాన ధర్మాలు చేయటం ఎంతో గొప్ప విషయం అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జల్ పల్లి మునిసిపాలిటీ పరిధిలోని పహడి షరీఫ్ లో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. ముస్లిం మహిళలతో ఉపవాస దీక్షల విరమణలో పాల్గొని, వారికి పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, ఉపవాసాలతో పేదల ఆకలి బాధలు తెలిసి మహమ్మద్ ప్రవక్త చూపిన దారిలో మంచి పనులు చేయటం ఎంతో గొప్ప విషయం అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రంలో అన్ని మతాలకు,కులాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నారని,దసరా సందర్భంగా చీరల పంపిణీ, క్రిస్మస్ సందర్భంగా కానుకలు,రంజాన్ కు తోఫా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 న రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముస్లింలకు ఎల్ బి స్టేడియంలో దవాత్ ఏ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఈద్ ప్రత్యేక ప్రార్ధనలు జరిగే ఈద్గాను పరిశీలించి, పలు అభివృద్ధి పనులు చేయాలని,ఈద్ కోసం ఈద్గాను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈద్గా వద్ద ఉన్న శ్మశాన వాటిక ను కోటి రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా ముస్లింలు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Home
Unlabelled
ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక,,,, ఉపవాసాలతోపాటు ధనధర్మాలు చేయడం గొప్పవిషయం ,,,, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,,,, పహాడీ షరీఫ్ ఇప్తార్ విందులో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: