సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చండి
ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు
గులాబీమయంగా మారిన నర్సింహారెడ్డి గార్డెన్
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్త్రుతంగా తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారంనాడు మహేశ్వరం నియోజకవర్గ పరిధి లోని కందుకూరు మండలం కందుకూరు సామ నర్సింహారెడ్డి గార్డెన్లో భారత రాష్ట్ర సమితి ఆత్మీయ (బీఆర్ఎస్) సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...
ఈ ఆత్మీయ సమ్మేళన సభకు భారీగా తరలివచ్చిన అక్క చెల్లెలకి అన్న తమ్ములకి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కేసిఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు ను ప్రజలలోకి తీసుకపోవాలని మంత్రి కోరారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరస్తూ జనంలోకి వెళ్లాలని పార్టీ నేలకు ఆమె సూచించారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.... దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయని తెలిపారు. ఇదిలావుంటే ఈ ఆత్మీయ సమ్మేళన సభకు భారీగా గులాబీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నర్సింహారెడ్డి గార్డెన్ అంతా గులాబీమయమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ అధ్యక్షులు, పిఎసి చైర్మన్ ,డైరెక్టర్లు ఎంపీటీసీలు ,సర్పంచులు నాయకులు, కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు.
Post A Comment:
0 comments: