పదవుల కోసం కాదు ప్రజల కోసం పాటుపడుతున్నాం
అందుకే ప్రజల ఆశీర్వాదాలు మాకున్నాయి
మంత్రి పదవే కావాలనుకుంటే 22 ఏళ్ల కిందటే టిడిపిలో చేరిండేను
రాజకీయాలలో అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప కుటుంబాలను లాగొద్దు
ఇష్టమోచ్చనట్లు మాట్లాడితే.... ఊరుకొనేది లేదు ఖబర్థార్
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
పదవుల కోసం కాదు ప్రజల కోసం పాటుపడుతున్నాం..అందుకే ప్రజల ఆశీర్వాదాలు మాకున్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగంగా అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో పలు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... నాలుగు దశాబ్దాలుగా నేను, స్వర్గీయ ఇంద్రారెడ్డి రాజకీయాల్లో ఉన్నాం. పదవుల కోసం కాదు ప్రజల కోసం పాటుపడుతున్నాం కాబట్టి ప్రజల ఆశీర్వాదాలు మాకున్నాయి.
నాడు ఇంద్రారెడ్డి చనిపోతే అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు టీడీపీలో చేరమని,మంత్రి పదవి ఇస్తామన్న పోలేదు...మంత్రి పదవే కావాలనుకుంటే 22 ఏళ్ల కిందటే మంత్రిగా ఉంటుండే. నాపై ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమే బిఆర్ఎస్ పార్టీలో చేరాను, నన్ను గెలిపించిన నా ప్రజల గెలుపు కోసమే తప్ప వేరే ఆలోచన లేదు. నాడు ఇంద్రారెడ్డి చనిపోయినపుడే రాజకీయాలు వద్దనుకున్న కానీ నాడు ఇంద్రన్న అభిమానులు, నాయకుల ఒత్తిడి మేరకు పాలక పక్షం మొత్తం చేవెళ్ల లో తిష్ట వేసిన ప్రతిపక్ష పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం ప్రజలకు తెలుసు.తాను చేస్తున్న అభివృద్ధితో పోటీ పడలేని వారు, కోట్లాది రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే తమ ఉనికి ప్రశ్నర్థకంగా మారడంతో కల్లుమండి దిగజారి విమర్శలు చేస్తున్నారు. బాలాపూర్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకా మంత్రి మాట్లాడుతూ...కొంతమంది నేతలు నన్ను ఇక్కడనుండి ఓడి బియ్యం పోసి పంపుతారట.....హిందు సంప్రదాయం లో భర్త లేని మహిళకు ఇలా చేస్తారా? రాజకీయాల కోసం వ్యక్తిగతంగా మాట్లోడొచ్చా..
అక్కా చెల్లెళ్ళు మహిళలు లేరా వాళ్ళ కుటుంబాల్లో .మళ్ళీ ఒక్కసారి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్..తనను నమ్ముకున్న ప్రజల కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తా......రాజకీయాలలో అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప కుటుంబాలను లాగొద్దు..నీచ రాజకీయాల చేయొద్దు....ఎన్నికల్లో ఎవరు బాగా పనిచేస్తే ప్రజలు వాళ్ళను ఆదరిస్తారు.ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళను గెలిపిస్తారు.ఎన్నికల ముందు ప్రజల ముందుకు వచ్చి ఓడిపోగానే మాయం అయి మళ్ళీ వస్తే తగిన సమయంలో బుద్ధి చెప్తారు.గులాబీ మయంగా మారిన బాలాపూర్ ...
అడుగడుగున సబితమ్మకు జననీరాజనం
మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనల్ని గెలిపించిన ప్రజలు మనపై నమ్మకం ఉంది గాలికి తిరిగేవారు గాలి మాటలే మాట్లాడుతారు మనం బాధ్యతగా వ్యవహరించాలి
అని తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నాయకుల్లారా అభివృద్ధి కోసం పోరాడుదాం నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబర్దార్ అని మంత్రి హెచ్చరించారు. 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల మా కుటుంబం నేను మంత్రి కావాలి అని నా మనసులో అనుకుంటే 22 సంవత్సరాల కిందటే నేను మంత్రి అయ్యేదాన్ని అని గాటుగా సమాధానమిచ్చారు.మా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు సభితమ్మకు మేం అండగా ఉంటాం
తెగేసి చెప్పిన బాలాపూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్ఘంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. బాలాపూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ, పాదయాత్రగా బాలాపూర్ గ్రామాన్ని పర్యటించి ఆత్మీయ సమ్మేళన సభకి విచ్చేసిన మంత్రివర్యులు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కొంతమంది ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నా
ఈ ముఖ్యమంత్రి ప్రకారంగా ఏం చేశారు ముఖ్యమంత్రి అని అంటున్నారు మీ కంటికి కనిపించడం లేదా మీరు ఉపయోగిస్తున్న గృహ ఉపయోగ లకు పరిశ్రమల వినియోగదారులకి ఎన్ని గంటల విద్యుత్ ఉండే ఇప్పుడు ఎన్ని గంటల విద్యుత్ నిరంతరాయంగా ఉంటుంది మీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి ఇది అభివృద్ధి కాదా మిషన్ భగీరథ ద్వారా ఆడబిడ్డలు మంచినీటి కోసం రోడ్డుమీదికి వెళ్లకుండా మంచినీటి నల్ల కనెక్షన్లు మీ ఇంటి వద్ద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ది కాదా నిరుపేద కుటుంబాలకి ఆడబిడ్డ పెళ్లి చేస్తే అప్పుల పాలైన వారికి మేనమామ లాగా వారికి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఒక లక్ష 16 వేల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదా!2016 రూపాయాలు వృద్ధులకు, వితంతువులకు,మరుగుజ్జులకు డయాలసిస్ మరియు 3016 రూపాయాలు వికలాంగులకు, పెద్ద ముత్తాన పెన్షన్లు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేని పెన్షన్లు ఇంత పెద్ద మొత్తాన్ని అందజేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న మాట వాస్తవం కాదా ! ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నవి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్షాలకి ఎక్కడ వారి ఉనికి కోల్పోతామని భయంతో బిఆర్ఎస్ పార్టీ పైన బిఆర్ఎస్ నాయకుల పైన నరం లేని నాలిక మాట్లాడే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Home
Unlabelled
పదవుల కోసం కాదు ప్రజల కోసం పాటుపడుతున్నాం.. అందుకే ప్రజల ఆశీర్వాదాలు మాకున్నాయి,,, మంత్రి పదవే కావాలనుకుంటే 22 ఏళ్ల కిందటే టిడిపిలో చేరిండేను,,, రాజకీయాలలో అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప కుటుంబాలను లాగొద్దు ,,, ఇష్టమోచ్చనట్లు మాట్లాడితే.... ఊరుకొనేది లేదు ఖబర్థార్ ,,, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: