బండి సంజయ్ ను వెంటనే అరెస్టు చేయాలి

జల్పల్లి లో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నేతలు

స్థానిక పోలీస్ స్టేషన్లో బండి పై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ ఉద్యమ నేత  శాసనమండలి సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన  తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ని వెంటనే అరెస్టు చేయాలని జల్పల్లి బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నాడు మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని  ముత్యాలమ్మ దేవాలయ   చౌరస్తాలో  వందలాదిమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు  వెంటరాగా జల్పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, కార్యనిర్వాక అధ్యక్షులు యంజాల జనార్ధన్, షేక్ జహంగీర్,   యువ నాయకులు యంజాల అర్జున్, జలపల్లి మున్సిపాలిటీ బీసీ సెల్ అధ్యక్షులు ఉస్కెమూరి నిరంజన్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు.


స్థానిక పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జలపల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి   మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నాయకత్వంలో   జరుగుతున్న అభివృద్ధి నీ చూసి ఓర్వలేక  కేంద్ర రాష్ట్ర బిజెపి నాయకులు  సి.బి.ఐ , ఈ.డి  కేసులతో  నోటీసులు పంపి అక్రమ కేసులతో  భయపెట్టాలని చూస్తే   తెలంగాణా బతుకమ్మ  కవితక్క ను వేధింపులకు గురించేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. దేశంలో బిజెపి ఇతర పార్టీలను ఒక తాటి  పై తీసుకొని వచ్చి మతతత్వ పార్టీ  బీజేపీ  కి  మోడీకి వ్యతిరేకంగా దేశ రాజధానిలో  చక్రం  తిప్పుతున్న  కెసిఆర్ పై.. కెసిఆర్ కుటుంబ సభ్యులపై  అక్రమ కేసులు బనాయిస్తున్నారని...... చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తీవ్రంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: