సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి దోషులను శిక్షించాలి

పేపర్ లీక్ ఘటనపై బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ డిమాండ్

"మా నౌకరీలు మాగ్గావాలె - నిరుద్యోగ మహాధర్నా"లో పాల్గొన్న బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

టిఎస్పీఎస్సి పేపర్లు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ డిమాండ్ చేశారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన "మా నౌకరీలు మాగ్గావాలె - నిరుద్యోగ మహాధర్నా" కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులతో కలసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం విద్యార్థులు సాధించిన తెలంగాణలో సంవత్సరాలుగా తల్లితండ్రులకు దూరంగా,

ఇల్లు వాలికి తాకట్టు పెట్టుకొని మరి ఉద్యోగాలు సాధించాలన్న పట్టుతో నిరుద్యోగులు తిండి తిప్పలు లేకుండా కస్టపడి పరీక్షలు రాస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈరోజు నిరుద్యోగులను రోడ్డున పడేసిందని విమర్శించారు. అందుకే వారికీ అండగా నిలబడటానికి బిజెపి మరో తెలంగాణ నిరుద్యోగ ఉద్యమానికి సిద్ధమైందని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి టిఎస్పీఎస్సి  పేపర్ లీక్  అస్సలు దోషులను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎల్గని నగేష్ గౌడ్, నీరటి కుమార్, నీరటి నర్సింహా, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: