పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడి సోదరుడు గుండెపోటుతో హఠాన్మరణం

గుండె పోటు కారణంగా నిల్చున్న చోటే కుప్పకూలి పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడి సోదరుడు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజ్‌ ఠాకూర్‌ సోదరుడు ఠాకూర్ శైలేందర్‌ సింగ్‌ కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. గోదావరిఖనికి చెందిన శైలేందర్‌.. రోజూలాగే ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో తలుపుకు తాళం వేసి లిప్ట్ బటన్ నొక్కాడు. అనంతరం కాస్త నీరసంగా అనిపించి గోడను పట్టుకుని నిల్చున్నాడు. అనంతరం ఉన్నట్లుండి ఒక్కసారిగా కూప్పకూలిపోయాడు. క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. చుట్టూ పక్కల ఎవరూ లేకపోవటంతో చాలా సేపు వరకు అతడిని ఎవరూ గమనించలేదు. శైలేందర్ కిందపడిపోయి చనిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఇటీవల ఇలా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. పది రోజుల క్రితం ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా కూప్పకూలి మృతి చెందాడు. జిమ్ సెంటర్‌లో వ్యాయమం చేస్తూ.. ఓ కానిస్టేబుల్, బ్యాడ్మింగ్టన్ ఆడూతూ మరో యువకుడు ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు విడిచిన వారెందరో. ఉన్నట్లుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవటం కలవరపాటుకు గురి చేస్తుంది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: