అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించిన....
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని మంచాలకట్ట గ్రామంలో అకాల వర్షం,వడగండ్ల వాన వల్ల నష్టపోయిన పంటలను పాణ్యం ఎమ్మెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రైతన్నలతో, వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా రైతున్నలు నష్టపోయిన అరటి,మిరప, మొక్కజొన్న మరియు మునగ పంటలు పండించిన రైతన్నలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుదని భరోసా ఇచ్చారు.
వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న రైతన్నల పంటల జాబితాను రూపొందించి రైతన్నలకు న్యాయం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో గడివేముల జెడ్పిటిసి ఆర్బి.చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ నాగమదమ్మ, వైసిపి నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, పెసర వాయి శ్రీకాంత్ రెడ్డి, బొల్లవరం భూపాల్ రెడ్డి, కాలు నాయక్, తహసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో విజయసింహారెడ్డి, వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించిన.... పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: