శ్రీ మూల పెద్దమ్మ జాతర తిరుణాల సందర్భంగా...

వాహనాల దారి మళ్లింపు

గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య వెల్లడి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలో స్థానిక గడివేములలో ఉగాది పండుగ సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీ మూల పెద్దమ్మ జాతర తిరుణాల సందర్భంగా వాహనాలను దారి మళ్లించనున్నట్లు గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య వెల్లడించారు.


అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు,ప్రజలు వస్తున్న కారణంగా భక్తులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా రహదారి వాహన ప్రయాణికులు, భారీ వాహన యజమానులు, వాహన వినియోగదారులు 23.03.2023వ తేదీ ఉదయం 6 గంటల నుండి 25.03.2023వ తేదీ సాయింత్రం  6 గంటల వరకు  బుజునూరు వైపు నుండి గడివేముల మీదుగా నందికొట్కూరు, కర్నూలు వైపు వెళ్ళుటకు వాహనాలకు ప్రవేశం లేదని, నందికొట్కూరు వైపు వెళ్ళుటకు ఆత్మకూరు మీదుగా కర్నూలు వెళ్ళుటకు పాణ్యం మీదుగా ప్రయాణాలు కొనసాగించి సహకరించాలని వాహనదారులకు గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య విజ్ఞప్తి చేశారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: