నవీన్ హత్య కేసులో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి

తెలంగాణలో సంచలనం రేపిన నవీన్ హత్య కేసు వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు. ముసరాంబాగ్‌లో సోదరి ఇంటికి నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. హరిహరకృష్ణతో పాటు సోదరిని పోలీసులు ప్రశ్నించారు. అనంతరం నిందితుడిని అంబర్‌పేట్ నుంచి అబ్ధుల్లాపూర్‌మెట్‌కు తీసుకెళ్లారు.

స్పాట్‌లో హత్య జరిగిన తీరుపై హరిహరకృష్ణను పోలీసులు ప్రశ్నించారు. హత్య చేసిన తర్వాత తన అత్యంత స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లి నిందితుడు బట్టలు మార్చుకున్నాడు. దీంతో హాసన్ ఇంట్లో సాక్ష్యాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఈ హత్యలో ఇంకా ఎవరి ప్రయేమమైనా ఉందా? అనే కోణంలో నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నవీన్‌ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కస్టడీలో భాగంగా హత్యపై నవీన్‌ను అన్ని కోణాల్లో లోతుగా ప్రశ్నిస్తున్నారు.

ఈ కేసులో అనేక అనుమానాలు పోలీసులకు వ్యక్తమవుతున్నాయి. హరిహరకృష్ణ ఒక్కడే హత్య చేశాడా? లేక ఎవరైనా అతడికి సహకరించారా? అనేది ఆరా తీస్తున్నారు. ఒక్కడే హత్య చేసి ఉండదని, ఎవరో ఒకరైనా సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సహకరించిన వ్యక్తిని గుర్తించేందుకు హరిహరకృష్ణను ప్రశ్నిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ వరకు నవీన్‌ను ఎవరు తీసుకొచ్చారు? అక్కడ హరిహరకృష్ణకు సహకరించింది ఎవరు? అనే విషయాలను ప్రశ్నిస్తున్నారు.

అలాగే నవీన్ హత్య వెనుక యువతి పాత్రపై ఎంక్వైరీ టీమ్ ఆరా తీస్తోంది. పోలీసుల విచారణలో హరిహరకృష్ణ కీలక విషయాలు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని ట్విస్ట్‌లు ఈ కేసులో చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: