రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా

ముస్లిం సోదరులకు  శుభాకాంక్షలు తెలిపిన  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.నెల వంక కనిపించడంతో శుక్రవారం నుండి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లింలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.


నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి పేదల ఆకలి బాధలు తెలుసుకొని,దాన ధర్మాలు చేస్తూ సమాజ సేవలో ముందుండటం ఎంతో గొప్ప విషయం అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లో అన్ని మతాలకు సమానంగా చూస్తూన్నారని అన్నారు.రంజాన్ మాసం సందర్భంగా ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి  చేసినట్లు తెలిపారు. పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం లో భక్తి శ్రద్ధలతో (రోజా) ఉపవాసం ఉండాలని,అందరికి మేలు జరగాలని కోరుకున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: