ఆ స్థలాల రెగ్యులరైజ్ కు అవకాశం

వాటిని సద్వినియోగం చేసుకోండి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెగులరైజ్ చేసుకోవటానికి మరొక అవకాశం కల్పించారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. వచ్చే నెల ఏప్రిల్ 1 వ తేదీ నుండి 58,59 జి ఓ లకు సంభందించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి తెలిపారు. సోమవారం నాడు మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి రెవెన్యూ అధికారులతో 58,59 జి ఓ లకు సంభందించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో 2014 వరకు కట్ ఆఫ్ గా ఉండగా తాజాగా 2020 జూన్ 2 వరకు కట్టుకున్న వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


నోటరీ,ఇతరత్రా ప్లాట్ ల పైన కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గములో 58 జి ఓ ద్వారా 966 మంది లబ్ధిదారులకు హక్కులు కల్పించినట్లు త్వరలో వాటిని పంపిణీ చేస్తామన్నారు.ఏప్రిల్ 1 నుండి 30 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో కందుకూరు ఆర్డీవో సూరజ్ కుమార్, తహశీల్దార్ లు జనార్దన్ రావు,  మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: