ధారూర్ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం

ముఖ్యఅతిధిగా హాజరైన సబితా ఇంద్రారెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

పార్టీ నేతలను, కార్యకర్తలను ఇంటి మనిషిగా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అదే క్రమంలో పార్టీనేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అంతే అభిమానంతో కలుస్తారు. ఇదిలావుంటే ధారూర్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ధారూర్ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధరూర్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కుటుంబ సభ్యులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఘనంగా సత్కరించారు. 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: