ఆపదను అర్థం చేసుకునే వారికే సమాజంలో ఆదరణ

టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

తోటి మనుషుల అపదను అర్థం చేసుకొని వారికి తోడుగా నిలబడే వారే సమాజంలో మంచి మనుషులుగా ఆదరణ పొందగలుగుతారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు. కూకట్ పల్లి లోని ఎస్.ఎస్.పి.ఎన్.వి కల్యాణ మండపంలో కూకట్ పల్లి ప్రెస్ క్లబ్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు.


సమాజంలో యువతకు ఆదరణ కరువై నిరుత్సాహంతో ఆందోళన చెందుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా దిగులు చెందుతున్న యువతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, స్వచ్చంద సంస్థలపై ఉంటుందని విరాహత్ సూచించారు. ఈ నేపథ్యంలోనే సామాజిక స్పృహతో నిరుద్యోగులకు తోడుగా నిలిచి జాబ్ మేళకు శ్రీకారం చుట్టిన కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ బాధ్యులను ఆయన అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి బాలాజీనగర్ కార్పోరేటర్ శిరీష బాబూరావు, టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోతె వెంకట్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు జి.బాల్ రాజ్ గౌడ్, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరీం, రంజిత్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ బాధ్యులు నేహా, రాములు తదితరులు పాల్గొన్నారు.

జాబ్ మెళాకు అపూర్వ స్పందన

కూకట్ పల్లి ప్రెస్ క్లబ్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాకు భారీ స్పందన లభించింది. దాదాపు 60 కంపెనీలు ఉపాధి అవకాశం కల్పించగా, 600మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: