కేఎంసి విద్యార్థిని దారావత్ ప్రీతి కుటుంబానికి న్యాయం చెయ్యాలి
ఎబివిపి కోఠీ జిల్లా కన్వీనర్:సభావట్.కళ్యాణ్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
ప్రీతీ కుటుంబానికి న్యాయం, చేసి దోషికి ఉరిశిక్ష విధించాలని విద్యార్థులతో కలిసి ఆందోళన చెయ్యడం జరిగింది. కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న దారావత్ ప్రీతీ సీనియర్ విద్యార్థి ఎం.ఏ సైఫ్ ర్యాగింగ్, వేధింపులు భరించలేక మనస్థాపం చెంది చనిపోయింది. ప్రీతీ కుటుంబానికి న్యాయం, దోషికి ఉరిశిక్ష విధించాలని సిటీ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ మరియు ఆందోళన చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఎబివిపి కోఠీ జిల్లా కన్వీనర్ కళ్యాణ్, నగర కార్యదర్శి నితిన్, కళాశాల ప్రెసిడెంట్ దిలీప్ మాట్లాడుతూ... ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలి రాష్ట్ర ప్రభుత్వం దారావత్ ప్రీతీ కుటుంబానికి న్యాయం చేయాలి, కళాశాల అధికారులను కఠినంగా శిక్షించాలి, ప్రీతి ఆత్మహత్య ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జించే విచారణ జరిపించాలి, డాక్టర్ ప్రీతీ ఆత్మహత్యాయత్నం అనంతరం వైద్య విద్య కళాశాలలో ర్యాగింగ్ సాధారణం అని ప్రకటించిన అధికారులను సస్పెండ్ చేయాలి.
రాష్ట్రంలో తరచూ వెలుగు చూస్తున్న ర్యాగింగ్ విష సంస్కృతిని నిషేధించేలా ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి సాజన్,కోఠీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్,నగర సంయుక్త కార్యదర్శి రాహుల్,అఖిల్, విద్యార్థి నాయకులు ప్రియ, విగ్నేష్,శిరీష, శివ,అభి, ఉదయ్,విష్ణు ప్రతాప్, రాహుల్, రితికేష్,అఖిలేష్, పాల్గొన్నారు.
Home
Unlabelled
కేఎంసి విద్యార్థిని దారావత్ ప్రీతి కుటుంబానికి న్యాయం చెయ్యాలి ,,, ఎబివిపి కోఠీ జిల్లా కన్వీనర్:సభావట్.కళ్యాణ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: