వయోవృద్ధులకు పెద్ద కొడుకు ముఖ్యమంత్రి కేసీఆర్
శ్రీరామ్ నగర్ కాలనీ ఆత్మీయ సమ్మేళన సభ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
రాష్ట్రంలోని వయోవృద్ధులకు పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలబడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోని జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వయోవృద్ధులకు రూ. 2వేల పెన్షన్ ఇస్తూ పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు, మిషన్ భగీరథ , చెరువుల సుందరీకరణ అక్కడితో ఆగకుండా కంటి వెలుగు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు. మహేశ్వరం నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు మంజూరు చేసి అన్ని ప్రాంతాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
ఒకప్పుడు జలపల్లి కి రావాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణం పక్కా డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ అన్ని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో పనులు జరగాల్సి ఉందని, వాటిని కూడా దశల వారీగా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదలైన వారు ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకున్న వారు రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల ఒకటో తేదీ నుండి ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియ అమలులోకి రానుందని, ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న వారు 2020 లోపు ఉన్నవారు అర్జీ పెట్టుకోవాల్సిందిగా మంత్రి తెలిపారు.తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరచాలి అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి అనుకుంటే సబితా ఇంద్రారెడ్డిని బలపరిచి అభివృద్ధికి బాటలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకురాలు, జలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, సూరెడ్డి కృష్ణారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
sabitha reddy
Post A Comment:
0 comments: