మంచి పనులెన్నో చేసాం.... ప్రజలకు వివరిద్దాం

ప్రతి కుటుంబానికి కనీసం ఒక పథకంతో లబ్ది

ఊరూరా,వాడవాడలా బిఆర్ఎస్ ప్రచారం చేద్దాం

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ప్రభుత్వం తరఫున  మంచి పనులెన్నో చేశాం వాటిని ప్రజలకు వివరిద్దామని పార్టీ నేతలు, కార్యకర్తలకు  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలునిచ్చారు. ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో అన్ని స్థాయిల్లో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ పటిష్టత కు ఆత్మీయ సమ్మేళనాలు ఎంతగానో దోహదం చేస్తాయని మంత్రి  పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో మీర్ పేట్ లో గల ఎస్ వై ఆర్ గార్డెన్ లో మంగళవారం నాడు పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ


పార్టీ శ్రేణులు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి పార్టీ పటిష్టత కు పాటుపడాలన్నారు.తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశానికే ఆదర్శoగా నిలిచిందని అన్నారు.మన ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలని,ప్రతిపక్షాల విమర్శలను ఎక్కడిక్కడ తిప్పి కొట్టాలన్నారు.తెలంగాణ మోడల్ పరిపాలనను నేడు దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఆ దిశగా అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మేళనానికి హాజరైన పార్టీ జిల్లా ఇంచార్జ్,ఎమ్మెల్సీ  ఎల్ రమణ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఎంతో బలంగా ఉందని,అదే స్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు.పార్టీ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో,జిల్లా మంత్రి సబితా రెడ్డి,ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు,ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి  కిషన్ రెడ్డి,ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, మూసి రివర్ బోర్డు చైర్మన్ ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి ,ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి గారు,దయనంద్, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్ , వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఆయాచితం శ్రీధర్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, లక్ష్మీ నారయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, డీసీసీబీ,డీసీఎంఎస్ చైర్మన్లు మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: