బిజెపి ఎమ్మెల్సీ గెలుపు సంబరాలు నిర్వహించిన...

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ 

టపాసులు పేల్చి... మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న బిజెపి నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

 ఉమ్మడి మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన “బిజెపి అభ్యర్థి శ్రీ ఏవిఎన్ రెడ్డి విజయోత్సవ సంబురాలను టపాసులతో రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి కార్యకర్తలతో కలిసి ఆరాంఘర్ చౌరస్తాలో బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు మిఠాయి తినిపించారు. సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ...మన రాజేంద్రనగర్ లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లిమెంట్ ఇంచార్జి మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, జిల్లా కార్యదర్శి మొండ్ర కొమురయ్య , అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్, మైలార్దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు విజయ్, బిజెపి మైలార్దేవ్ పల్లి డివిజన్ అధ్యక్షులు అడికే జనార్దన్, రాచూరి రాజశేఖర్, మైలార్దేవ్ పల్లి సంతోష్, మెండే కుమార్ యాదవ్, బీజేవైఎం, మహిళా మోర్చ నాయకులు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: