ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందని, ఇప్పటికే సంక్షేమాభివృద్ది కార్యక్రమాల అమలులో యావత్ దేశానికి తెలంగాణ మార్గదర్శంగా నిలుస్తోందని అన్నారు. దినదినాభివృద్ధి సాధిస్తూ,దేశంలో అగ్రగామిగా వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలు, ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Home
Unlabelled
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: