జింకల బావి కాలనీలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్నగర్ డివిజన్ జింకల బావి కాలనీలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెరెడ్డి పర్యటించారు. స్తానికంగా కాలనీలో నెలకొన్న సమస్యలను మంత్రి అడిగి తెలుసుకొన్నారు. తమ  కాలనీ లో కమిటీ హాల్  భవనం లేదు దానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం చేసి ఇవ్వాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఈ సందర్భంగా కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.  వీటితోపాటు కాలనీలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు మంత్రి దృష్టికి వారు తీసుకువచ్చారు.


దీనిపై స్పందించిన మంత్రి సబితా  ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించి వాటన్నింటిని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. కమిటీ హాల్ నిర్మాణం, స్థల కేటాయింపుపై త్వరలోనే మీకు శుభవార్త అందుతుందని ఆమె ఈ సందర్భంగా కాలనీవాసులకు అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో సరూర్నగర్ డివిజన్ అధ్యక్షులు మహేందర్ యాదవ్, సీనియర్ నాయకులు బేర బాలకృష్ణ, మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, లోకసాని కొండల్ రెడ్డి, కమిటీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మరియు బిఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

 




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: