నిరుద్యోగ యవతకు బాసటగా,,,

బండి సంజయ్  ‘‘నిరసన దీక్ష’’ లో పాల్గొన్న బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజా సమస్యలపైనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రజా నిరసనల్లో పాలుపంచుకోవడంలో ముందుంటారు బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్. ఇదిలావుంటే టీఎస్పీఎస్సీ  పేపర్ లీక్ వ్యవహారంతో రాష్ట్రంలోని యువత తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. నిరుద్యోగ యువత కోసం బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తోపాటు బుక్క వేణుగోపాల్ పాదయాత్రగా బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి బయలుదేరి నాంపల్లి గన్ పార్క్ వద్ద జరిగిన ‘‘నిరసన దీక్ష’’ లో పాల్గొన్నారు.


కొలువుల కోసం కోట్లాడి సాధించుకున్న తెలంగాణ యువతను మోసం చేస్తున్న కెసిఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా టీఎస్పీఎస్సీ పర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ డిమాండ్ చేశారు. బాధ్యులైన కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి బండి సంజయ్ కుమార్ తో కలసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ దీక్షలో కూర్చున్నారు. 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: