బస్తీ దవాఖానాలతో... పేదల సుస్తీ నయం
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
పేదల సుస్తీ నయం చెయాటానికి బస్తీ దవాఖానలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బస్తీ దవాఖానలపై మంగళవారం మంత్రి కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖాన,50 వేల జనాభాకు ఒక అర్బన్ పి హెచ్ సి ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని,పేద ప్రజల చెంతకు వైద్యం తీసుకెళ్లటమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.జిల్లాలో 73 బస్తీ దవాఖానాలు మంజూరు కాగా 57 ఇప్పటికే ప్రారంభం అయ్యాయని, మిగతావి కూడా త్వరగా ప్రజలకు అందుబాటులో తేవాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా 27 యూపిహెచ్సి లు కూడా మంజూరు అయ్యాయన్నారు.ఈ నెల 24 న సిపిఆర్ పై జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అవగాహన సదస్సు నిర్వహిస్తూన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర రావు, బస్తీ దవాఖాన ప్రోగ్రాం ఇంచార్జ్ వినోద్, జిల్లా ట్రైనింగ్ అధికారి అనిత పాల్గొన్నారు.
Home
Unlabelled
బస్తీ దవాఖానాలతో... పేదల సుస్తీ నయం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: