శ్రీ శ్రీ మూల పెద్దమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి

 గడివేముల ఆలయ అధికారి సీతా మోహన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీ శ్రీ శ్రీ మూల పెద్దమ్మ ఆలయంలో భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలవకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారి సీతా మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ మూల పెద్దమ్మ ఆలయంలో 23 వతేదీ ఆకు పూజ, కుంకుమార్చన మరియు సాయంకాలం4:00 గంటల సమయం నుండి బోనకుండలతో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారని, దర్శనానికి విచ్చేసిన మహిళలకు మరియు పురుషులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.


సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాత్రి 9:00 గంటల సమయం నుండి కర్నూలు వారిచే సాంస్కృతి కార్యక్రమాలు ( ఆర్కెస్ట్రా ) నిర్వహిస్తున్నామని, 24వ తేదీన ఉదయం 10:00 గంటలకు గుండు, తాడులాగు పందెములు మరియు స్లో బైక్ రేస్లు ఉంటాయని ఆయన తెలిపారు.


ఏపీఎస్ఆర్టీసీ, పోలీస్ సిబ్బంది వారి సహకారంతో గడివేములకు విచ్చేయు భక్తులకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిన్నన్న, ఆలయధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: