మూడో తరగతి అనుమానస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించండి
అధికార్లను ఆదేశించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
అనుమానస్పద రీతిలో విద్యార్థి మరణించిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ సమీపంలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద మృతిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమగ్ర విచారణ చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను ఆదేశించారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ దేవసేనను ఆదేశించారు. విద్యార్థి మృతి అత్యంత బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Home
Unlabelled
మూడో తరగతి అనుమానస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించండి,,, అధికార్లను ఆదేశించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: