మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. వీ.రామణాచారి
సెట్విన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వీ.రామణాచారి పేర్కొన్నారు. సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ ఆధ్యక్షతన అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురష్కరించుకొని జరిగిన సదస్సులో కే.వీ.రమణాచారి పాల్గొని ప్రసంగించారు. సెట్విన్ సంస్థ యువతి, యువకులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలను చూపిస్తోందని ఆయన ప్రశంసించారు. శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలను కూడా సెట్విన్ కల్పించాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో సెట్విన్ ఇప్పటికే అనేక జాబ్ మేళలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సఫలమైందన్నారు. రాణికుముదిని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినపుడే మహిళా సాధికారిత సాధ్యమవుతుందన్నారు. సెట్విన్ సంస్థ మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ సంస్థలో శిక్షణ పొందిన వారు రూపొందించిన వస్తువలను కే.వీ.రమణాచారి పరిశీలించారు.
బ్యూటిషియన్, గార్మెంట్ మేకింగ్, ఫ్యాషన్ డిజైన్ శిక్షణ పొందిన వారు నిర్వహించిన మేళాను వాటి వివరాలను అక్కడి యువతులను అడిగి తెలుసుకొన్నారు. అంతకుముందు వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు కే.వీ.రమణాచారి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆధాయపుపన్నులశాఖ కమీషనర్ కాట్రగడ్డ హరితా, ఏజీఏపీఈ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ లింగే ఒగ్గు, సెట్విన్ అకౌంట్స్ ఆఫీసర్ టి.ఓంప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: