నిరుపేద కుటుంబాల్లో అగ్గిరాజేసిన మోదీ  సర్కార్ 

పెరిగిన గ్యాస్ ధరలు నిరసిస్తూ బడంగ్పేట్ లో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

 రోడ్డుపై కట్టెల పొయ్యి మీద కాఫీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 చాలు మోడీ చంపకు  మోడీ నినాదాలతో హోరెత్తిన బడంగ్పేట్

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి పెంచిన  వంట గ్యాస్ ధరలు నిరసిస్తూ  నడిరోడ్డు పైన  కట్టెల పొయ్యి పెట్టి కాఫీని తయారుచేసి   మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిరసన తెలిపారు.


భారీగా హాజరైన మహిళా సోదరీమణులు పాదయాత్రగా బడంగ్పేట్ లోనీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు  చేరుకున్నారు  పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని  *చాలు మోడీ చంపకు మోడీ* అనే నినాదాలతో హోరెత్తిన  బడంగ్పేట్  మంత్రి గారు మాట్లాడుతూ బిజెపి పతనం వంటింట్లోంచి ప్రారంభమైందని రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు ప్రజలకు  మీరు ఇచ్చే భరోసా కాస్త భారం కాకుండా చూసుకోవాలని హితువు పలికారు. 

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని ఎండను సైతం లెక్క చేయకుండా రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిరసన తెలిపిన మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమం బడంగ్పేట్ మున్సిపల్ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దబావి ఆనంద్ రెడ్డి గారు

మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్, కార్పొరేటర్ సుర్ణ గంటి అర్జున్, మీర్పేట్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ముద్ద పవన్  మరియు కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు మహిళా నాయకురాలు బిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: