చార్మినార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో
డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు
ప్రారంభించిన ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జి. సుధీర్ బాబు
(జానో జాగో వెెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
చార్మినార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సౌత్ జోన్ ట్రాఫిక్ వారు ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌ను ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జి. సుధీర్ బాబు ప్రారంభంచారు. వేసవి కాలం సందర్భంగా ఈ వాటర్ ఫ్లాంట్ ను ట్రాఫిక్ పోలీస్ శాఖ సామాన్య ప్రజలకు, పర్యాటకుల కోసం అందుబాటులోకి తెచ్చారు. చార్మినార్ ను సందర్శించే పర్యటకులతోపాటు రంజాన్ మాసం సందర్భంగా వచ్చే వారి కోసం కూడా ఈ వాటర్ ప్లాంట్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికార్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మైక్ 10 అధికారి అశోక్ కుమార్, మైక్ 12 అధికారి ప్రసాద్, అడిషనల్ డీసీపీ సౌత్ జోన్ ఎల్ అండ్ ఓ బి.ఆనంద్, సౌత్ జోన్‌లోని అన్ని డెల్టాలతో పాటు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతధికార్లు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: