ఫుట్ పాత్ లను ఆక్రమించవద్దు
మక్కా మసీదు వెళ్లేవారి కోసం దారిని క్లీయర్ గా ఉంచాలి
వ్యాపారులకు చార్మినార్ ట్రాఫిక్ పోలీస్ అధికార్ల ఆదేశం
రంజాన్ మాసం ఏర్పాట్లపై వ్యాపారులతో ట్రాఫిక్ పోలీస్ అధికార్ల సమావేశం
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
రంజాన్ మాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో చార్మినార్ పరిసర వ్యాపారులు, చిరు వ్యాపారులతో చార్మినార్ ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికార్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పుట్ పాత్ లను ఆక్రమించవద్దని చిరు వ్యాపారులకు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికార్లు సూచించారు. ప్రార్థనాల కోసం మక్కా మసీదుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిచేందుకు వీలుగా రహదారిని క్లియర్ గా ఉంచాలని వ్యాపారులకు సూచించారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికార్లు హెచ్చరించారు. ఈ సమావేశంలో సౌత్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ కె..శ్రీనివాసరావు, చార్మినార్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కె.ఎస్. రవి, ట్రాఫిక్ ఎస్పైలు కరుణాకర్ రెడ్డి, మల్లేశం తదితర్లు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: