ఏబీవీపీ కార్యకర్తలను తరలిస్తోన్న డీసీఎం డ్రైవర్‌కు ఫిట్స్,,,

ప్రాణాలకు తెగించి కంట్రోల్ చేసిన ఎస్సై

హైదరాబాద్‌ బంజారాహిల్స్ ఎస్సై.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16 మంది ప్రాణాలు కాపాడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రగతి భవన్ వద్ద ముట్టడికి వచ్చిన 16 మంది ఏబీవీపీ కార్యకర్తలని పోలీసులు అరెస్టు చేసి డీసీఎంలో ఖైరతాబాద్ వైపు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో డీసీఎం నడుపుతున్న హోంగార్డు రమేష్‌‌కి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. దీంతో డీసీఎం అదుపుతప్పి డివైడర్ మీదికి దూసుకు వెళ్తున్న సమయంలో బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి గమనించాడు. వెంటనే తన వాహనంలో నుంచి కిందికి దూకి.. ప్రాణాలకు తెగించి డీసీఎం వాహనాన్ని కంట్రోల్ చేశాడు. ఎస్సై కరుణాకర్ రెడ్డి సమయస్ఫూర్తితో స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

ఈ క్రమంలో ఎస్సైకి, డీసీఎంలో ఉన్న ఓ కానిస్టేబుల్ సాయికుమార్‌కు గాయాలయ్యాయి. గాయపడిన ఎస్సై కరుణాకర్ రెడ్డి, హోంగార్డు రమేష్‌ను వెంటనే యశోద హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించాడు. ప్రస్తుతం హోంగార్డ్ రమేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఎస్సై కరుణాకర్ రెడ్డి వాహనాన్ని కంట్రోల్ చేయకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని.. వెంటనే అప్రమత్తమై ప్రమాదం జరగకుండా అందర్నీ కాపాడిన కరుణాకర్ రెడ్డిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రాణాలతో బయటపడ్డ 16 మంది ఏబీవీపీ కార్యకర్తలు కూడా ఎస్సై కరుణాకర్ రెడ్డి చేసిన సాహసానికి ప్రశంసల వర్షం కురిపించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: