మాజీ హోంమంత్రి తూళ్ల  దేవేందర్ గౌడ్  కు,,,

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బుక్కవేణుగోపాల్

అలనాటి జ్ఞాపాకాలను నెమరేసుకొన్న ఇరువురు నేతలు


(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

మాజీ హోంశాఖ మంత్రి, రాజ్యసభ సభ్యులు తూళ్ల దేవేందర్ గౌడ్  70వ జన్మదినం సందర్భంగా వారి నివాసంలో ఆయన్ని రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులతో కలసి బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తూళ్ల దేవేందర్ గౌడ్ తో తనకున్న పరిచయాలు, పాత జ్ఞాపాకాలను బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ గుర్తుచేసుకొన్నారు.


ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నానావల్ల కుమార్ యాదవ్, న
ర్కుడ సర్పంచ్ సునిగంటి సిద్దులు, బీజేపీ శంషాబాద్ మండల ఉపాధ్యక్షులు బూరుకుంట సంజీవ, ఓబీసీ మోర్చా శంషాబాద్ మండల అధ్యక్షులు మల్చలం మోహన్ రావు, బిజెపి  నాయకులు ఎల్గని నగేష్ గౌడ్, నీరటి వీరేష్, ఎల్గని మల్లేష్ గౌడ్, నానావల్ల ప్రవీణ్ యాదవ్, బీవీజీ శివ,తెలుగు శ్రీకాంత్, పొగాకు సిద్దు, సుమన్, సాయి తదితరులు పాల్గొన్నారు.


 









Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: